ఆస్పత్రిలో తండ్రిని చూసి ఎమోషనల్‌ అయిన బిగ్‌ బాస్‌ కౌశల్‌ | Bigg Boss Kaushal Emotional For His Father | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో తండ్రిని చూసి ఎమోషనల్‌ అయిన బిగ్‌ బాస్‌ కౌశల్‌

Aug 29 2023 6:35 PM | Updated on Sep 2 2023 4:43 PM

Bigg Boss Kaushal Emotional For His Father - Sakshi

టీవీ నటుడు, మోడల్‌ అయినటువంటి కౌశల్‌ బిగ్‌బాస్‌ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా టైటిల్‌ సొంతం చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. కొన్ని యాడ్‌ ఫిలిమ్స్‌ తీస్తూ బిజీగా ఉన్నారు. తాజాగ  తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని ఓ వీడియోను కౌశల్‌ షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇలాంటి పని చేసింది ఆమె మాత్రమే)

తన తండ్రికి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేర్పించినట్లు కౌశల్‌ చెప్పారు. కానీ ఏ కారణం వల్ల ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని మాత్రం తెలుపలేదు. ఆయన తండ్రి సుందరయ్య బెడ్‌పై పడుకుని ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కౌశల్‌ షేర్‌ చేశాడు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుని ఉండి ఉంటారు.. కాబట్టి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అంతే ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వీడియోతో పాటు ఆయన చెప్పుకొచ్చాడు.

కౌశల్‌ తండ్రి సుందరయ్య కూడా బుల్లితెరపై పలు సీరియల్స్‌లలో నటించాడు. తన తండ్రి కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని కూడా కౌశల్‌ నిర్మించారు. ఆయన కోసం ఒక ఇంటిని నిర్మించి ఇవ్వాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేదని అది ఇప్పుడు తీరందని గతంలో కౌశల్‌ చెప్పుకొచ్చాడు. అభిమానుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారని కౌశల్‌ తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement