
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికున్ గున్యాతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. సుమారు 25రోజులుగా ఈమేరకు చిరు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే చికున్ గున్యా నుంచి ఆయన ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడంతో తాజాగా హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ జరిగింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ సంయుక్తంగా మెగాస్టార్‌కు అవార్డ్ అందించారు. కొద్దిరోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి పిలుపు మేరకు హాజరయ్యారు. స్టేజ్ మీదకు వెళ్తున్న సమయంలో కూడా హీరో సాయి ధరమ్‌తేజ్ చిరుకు సాయంగా వెళ్లాడు. చికున్ గున్యా వల్ల వచ్చిన నొప్పులతోనే ఈ ప్రోగ్రామ్‌లో చిరంజీవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment