
సాక్షి, మైసూరు: కన్నడ హీరో దర్శన్ ఫామ్ హౌస్‌లో అటవీ అధికారులు సోదా చేసి అరుదైన జాతికి చెందిన నాలుగు పక్షులను స్వాధీనం చేసుకున్నారు. మైసూరు నగరంలోని టీ నరిసిపుర రోడ్డు కెంపయ్యనహుండీ గ్రామ సమీపంలో దర్శన్ ఫామ్ హౌస్ ఉంది.
అక్కడ అరుదైన బార్ హెడెడ్ గూస్ జాతికి చెందిన జల పక్షులను పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు శుక్రవారం రాత్రి సోదా చేసి నాలుగు పక్షులను స్వాధీనం చేసుకున్నారు. బార్ హెడెడ్‌గూస్ పక్షులను పెంచడం నేరమని, అవి అడవుల్లోనే ఉండాలని అధికారులు పేర్కొన్నారు. జూ, ఇళ్లు, ఫారాలలో పెంచడానికి అనుమతి లేదని తెలిపారు.
చదవండి: బాలీవుడ్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ అమేజింగ్.. అది తెలుగు సినిమా అంటూ క్లాస్ పీకిన నెటిజన్లు
ఆ విషయంలో నయనతారకంటే ముందున్న హన్సిక