అయోధ్యకు జూ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? | Why Jr NTR Did Not Attend Ayodhya? - Sakshi
Sakshi News home page

అయోధ్యకు జూ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా?

Published Tue, Jan 23 2024 9:06 AM | Last Updated on Tue, Jan 23 2024 10:12 AM

Jr NTR Did Not Attend Ayodhya Why - Sakshi

వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ వేడుకను చూసేందుకు భారత్‌లోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖలు ఆయోధ్యకు చేరుకున్నారు. అక్కడ వారందరూ సందడిగా కనిపించారు. రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, ధనుష్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయోధ్య నుంచి ఆహ్వానం అందినా కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు నటీనటులు వెళ్లలేకపోయారు. జూ. ఎన్టీఆర్‌కు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది కానీ ఆయన వెళ్లలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం దేవర షూటింగ్‌ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్‌ అవుతుంది. 

దేవర సినిమా విషయంలో మేజర్‌ షెడ్యూల్‌ను ముందుగానే చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిందట.. అందుకోసం  సైఫ్‌ అలీఖాన్‌తో ముఖ్యమైన భారీ యాక్షన్‌ సీన్‌ను ప్లాన్‌ చేశారట. కొన్ని వందల మంది ఈ సినిమా షూటింగ్‌లో రోజూ పాల్గొంటున్నారట. తారక్‌ పాల్గొనే సీన్‌ కోసం భారీ సెట్‌ కూడా నిర్మించారట.. తన వల్ల షూటింగ్‌ ఆగిపోతే నిర్మాతకు ఇబ్బంది కలుగుతుందని ఆయన భావించారట. దీంతో ఆయోధ్యకు ఆయన వెళ్లలేక పోయారని టాక్‌ నడుస్తోంది.

ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్‌ అలీఖాన్‌ గాయం కారణంగా ఆస్పత్రిలో చేరడం. ఈ సమాచారం కూడా దేవర యూనిట్‌కు ఆలస్యంగా తెలువడంతో చివరి నిమిషంలో తారక్‌ అయోధ్య ట్రిప్‌ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.  అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్‌తో పాటు తారక్‌ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ కారణంతో వెళ్లలేకపోయిన ప్రభాస్‌ 
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ కూడా అయోధ్యకు వెళ్లలేకపోయారు. మారుతి సినిమా రాజాసాబ్‌ సినిమాతో పాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న  కల్కి సినిమా షూటింగ్‌ పనిలో ప్రభాస్‌ బిజీగా ఉన్నారట. కల్కి సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్స్‌ను చిత్రికరించే పనిలో నాగ్‌ అశ్విన్‌ ఉన్నారట. ఈ విషయంపై కూడా ప్రభాస్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్‌గా కృష్ణంరాజు జయంతి కార్యక్రమం జరిగింది. అందులో కూడా ప్రభాస్‌ కనిపించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement