
Kangana Ranaut Dhaakad Movie Release In Four Languages: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక అంశాలపై మాట్లాడటమే కాకుండా సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. కంగనా నటించే సినిమాలు ఎక్కువగానే ప్రేక్షదారణ పొందుతాయి. గతకొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ కంగనా చిత్రాలు అనువాదమవుతున్నాయి. తాజాగా కంగనా నటించిన మూవీ 'ధాకడ్'.
ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్ కానుంది. మనుషుల అక్రమ రవాణా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రలో అలరించనుంది. నిజానికి ఈ సినిమా గతేడాది అక్టోబర్ 1న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని మే 27న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కంగనా ఈ సినిమాలోని ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో శత్రువులపై ఫైరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెన్సివ్ లుక్‌లో కంగనా స్టిల్ ఉంది. ఈ సినిమాలో నెగెటివ్ రోల్లో అర్జున్ రాంపాల్ నటిస్తుండగా దివ్యా దత్తా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment