
ఓ స్టార్ హీరోతో కృతి సనన్ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని కొంతకాలంగా బీటౌన్ కోడై కూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘భేదియా’ ప్రమోషన్స్‌లో కూడా హీరో వరుణ్ ధావన్ కృతి ప్రేమలో ఉందని చెప్పాడు. ‘కృతి మనసులో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబైలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో షూటింగ్‌లో ఉన్నాడు’అని పరోక్షంగా ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. వరుణ్ మాటలకు కృతి సిగ్గుపడుతూ నవ్వింది తప్పా.. ఆయన చెప్పేది తప్పు అని అనలేదు.
దీంతో కృతి నిజంగానే ప్రభాస్‌తో ప్రేమలో ఉందని అంతా భావించారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్‌పై కృతి స్పందించింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ‘ఇది ప్యార్ లేదా ప్రచారం. ఆ రియాల్టీ షోలో మా భేదియా(వరుణ్ ధావన్) కాస్త అత్యుత్సాహం కనబరిచాడు. అతడు సరదాగా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కొన్ని వెబ్‌సైట్లు నా పెళ్లి తేదిని కూడా ప్రకటించాయి. అందుకే నేను ఈ రూమర్స్‌కి పుల్‌స్టాఫ్ పెడుతున్నా. వాటిలో ఎలాంటి నిజం లేదు’ అని కృతి సనన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment