
హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ చిత్రం ఒకటి కాదు రెండు భాగాలుగా రూపొందనుందనే న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘బాహుబలి’ సినిమా తరహాలోనే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డం, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నారు మహేశ్‌బాబు.
కాగా కథకు ఉన్నప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే సీక్వెల్స్ వస్తాయనే ఊహాగానాలూ ఉన్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment