
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గొప్ప మనసును చాటుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో అనాథ శరణాలయాన్నిసందర్శించారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ చిన్నారులతో కలిసి తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించారు.
(ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!)
పిల్లలతో కాసేపు సరదాగా గడిపిన మనోజ్.. అనంతరం వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. తన పుట్టిన రోజు వేడుకలను చిన్నారుల మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నారు. అనాథ పిల్లలతో మనోజ్ బర్త్ డే జరుపుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
మనోజ్ మాట్లాడుతూ.. 'పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భవిష్యత్తులో పిల్లలకు మరిన్ని సేవలు అందిస్తా. వారి కళ్లలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ' అని అన్నారు.
(ఇది చదవండి: తిండి లేక కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకున్నా: విలన్ గంగరాజు)
Comments
Please login to add a commentAdd a comment