
తెలుగు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ యువ నటుడు తిరువీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మూవీస్ చేస్తూనే ఓటీటీల్లోనూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'మిషన్ తషాఫి' వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. దానికి సంబంధించి అనౌన్స్‌మెంట్ ఇప్పుడు ఇచ్చారు. తిరువీర్ బర్త్ డే సందర్భంగా పోస్టర్‌తో విషెస్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: కిడ్నీ ఫెయిల్, చచ్చిపోతాననుకున్నా: హీరోయిన్)
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తిరువీర్ బర్త్ డే సందర్బంగా 'మిషన్ తషాఫి' టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రవీణ్ సత్తారు లాంటి డైరెక్టర్‌తో కలిసి పనిచేయటంపై తిరువీర్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇండియాలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ రా (RAW) ఏజెంట్స్‌కి మధ్య నడిచే హై ఇన్‌టెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది. 8 ఎపిసోడ్స్‌గా తీస్తున్న 'మిషన్ తషాఫి' త్వరలో జీ5లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Thank you @ZEE5Telugu #thefilmrepublic ❤️ https://t.co/wsmPbxYb02
— Thiruveer (@iamThiruveeR) July 23, 2023
(ఇదీ చదవండి: ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి!)
Comments
Please login to add a commentAdd a comment