డార్లింగ్ ప్రభాస్ కొత్తగా ఓ ఇల్లు తీసుకున్నాడు. కాకపోతే అది లండన్‌లో. అయితే దీన్ని కొనుగోలు చేయకుండా లీజుకి తీసుకున్నాడు. అలానే దీని నెల నెల ఏకంగా లక్షల్లో అద్దె చెల్లించబోతున్నాడట. ఈ ఇల్లు రెంట్ తీసుకోవడం వెనక ఓ కారణముందని తెలుస్తోంది. ఇంతకీ ఈ అద్దె ఇంటి గోల ఏంటి? ఇంతకీ అద్దె మొత్తం ఎంతనేది ఇప్పుడు చూద్దాం.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతమున్న పాన్ ఇండియా హీరోల్లో టాప్ అని చెప్పొచ్చు. 'బాహుబలి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. వరసపెట్టి మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. రెండు నెలల ముందు 'సలార్'తో వచ్చి హిట్ కొట్టిన ఇతడు.. మరో రెండు నెలల్లో 'కల్కి'గా రాబోతున్నాడు. మే9 ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీని తర్వాత ఇప్పట్లో చేసే సినిమాలైతే ఏం లేవు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట.
(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)
ఇందులో భాగంగానే లండన్‌లో ఓ ఖరీదైన బంగ్లాని ప్రభాస్ లీజుకి తీసుకున్నాడట. దీనికి నెల అద్దె ఏకంగా రూ.60 లక్షలని తెలుస్తోంది. ఇది తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇలానే ఇటలీలో కొన్నాళ్లపాటు ఉన్నాడు. నెలకు రూ.40 లక్షల వరకు అద్దె చెల్లించాడు. సో అదన్నమాట విషయం.
మే 9న 'కల్కి' సినిమా థియేటర్లలోకి రాబోతుంది. మార్చి నెల మధ్యలో నుంచి దీని ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. స్టోరీ విషయానికొస్తే.. మహాభారత కాలంలో మొదలై 2989AD వరకు ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చెప్పడంతో 'కల్కి'పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టైటిల్ సీక్రెట్ ఇదే: నాగ్ అశ్విన్)
Comments
Please login to add a commentAdd a comment