సినిమా అవకాశాల కోసం మరో రూట్‌ ప్లాన్‌ చేసిన రాశీఖన్నా | Raashi Khanna New Plan To Get Movie Chance | Sakshi
Sakshi News home page

సినిమా అవకాశాల కోసం మరో రూట్‌లో వెళ్తున్న రాశీఖన్నా

Published Mon, Mar 11 2024 12:06 PM | Last Updated on Mon, Apr 8 2024 12:39 PM

Raashi Khanna New Plan For Movie Chance - Sakshi

రాశీఖ‌న్నా.. ఒకప్పుడు టాలీవుడ్‌లో బీజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. చిత్ర సీమలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి అయినా కూడా సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లోని ప్రేక్షకులను మెప్పిస్తుంది. థాంక్యూ, పక్కా కమర్షియల్‌ చిత్రాల తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ హిందీ వర్షన్‌లో వచ్చిన ఫర్జీ అనే వెబ్‌ సిరీస్‌లో మాత్రం కనిపించింది. ప్రస్తుతం అవకాశాల వేటలో ఈ బ్యూటీ ఉంది.

కోలీవుడ్‌లో కూడా పలు చిత్రాలతో రాణించిన ఈ బ్యూటీ.. ఎక్కువగా గ్లామర్‌ను ప్రదర్శించడం పైనే దృష్టి పెట్టినా ఎందుకనో రాశీఖన్నాకు అక్కడ  పెద్దగా వర్కౌట్‌ కాలేదు. దీంతో అవకాశాలు కనుమరుగు అయ్యాయనే చెప్పాలి. కోలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ నటించిన చివరి చిత్రం తిరుచిట్రం బలం (తిరు). ధనుష్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ క్రెడిట్‌ను నటుడు ధనుష్‌తో పాటు ప్రధాన నాయకిగా నటించిన నిత్యామీనన్‌ కొట్టేశారు.

అందులో రాశీఖన్నా కొన్ని సన్నివేశాల్లోనే కనిపించారు. ఇకపోతే తెలుగులో పలు హిట్‌ చిత్రాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం అక్కడ, ఇక్కడ అవకాశాలు నిల్‌. హిందీలో యోధ అనే చిత్రం మాత్రమే ఈ అమ్మడి చేతిలో ఉంది. దీంతో మళ్లీ అందాలారబోతతో అవకాశాల వేట మొదలుపెట్టారు. రాశీఖన్నా తాజాగా ప్రత్యేకంగా ఫొటో షూట్‌ నిర్వహించుకుని ఆ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement