Shruti Haasan Salaar, నా క్యారెక్టర్‌కు ఫైట్స్‌ లేవు: శ్రుతీ హాసన్ | Salaar Movie Updates - Sakshi
Sakshi News home page

నా క్యారెక్టర్‌కు ఆ సీన్స్‌ లేవు: శ్రుతీ హాసన్‌

Mar 6 2021 1:43 PM | Updated on Mar 6 2021 5:27 PM

Shruti Haasan Opens On Her Role In Salaar - Sakshi

ప్రభాస్‌తో సినిమా చేయడం చాలా బాగుంది. తను నిజంగా చాలా మంచి వ్యక్తి.

ఇప్పటివరకూ ప్రభాస్‌తో తప్ప తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసనా నటించారు శ్రుతీహాసన్‌. ‘సలార్‌’ సినిమాతో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది భారీ యాక్షన్‌ డ్రామా మూవీ. హీరో మాత్రమే కాదు.. హీరోయిన్‌కి కూడా యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయనే టాక్‌ వినిపించింది. ఈ విషయం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘ఇది యాక్షన్‌ సినిమానే అయినా నా క్యారెక్టర్‌కు ఫైట్స్‌ లేవు. ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాను. ప్రభాస్‌తో సినిమా చేయడం చాలా బాగుంది. తను నిజంగా చాలా మంచి వ్యక్తి. కొంతమంది తాము నిరాడంబరంగా ఉంటున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభాస్‌ సహజంగానే నిరాడంబరంగా ఉంటారు. చాలా డౌన్‌ టు ఎర్త్‌. లొకేషన్‌లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ఆయన సెట్‌లో ఉంటే షూటింగ్‌ అంతా ఒక పాజిటివ్‌ వైబ్‌ ఉంటుంది’’ అన్నారు.

బాయ్‌ఫ్రెండ్‌ కోసం...
ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు శ్రుతీహాసన్‌. తమ మధ్య ఉన్న బంధం గురించి ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను హజారికా, శ్రుతీహాసన్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంతను కూడా చెన్నైలోనే ఉన్నారు. అతని కోసం చెఫ్‌గా మారారు శ్రుతి. ‘రామెన్‌’ తయారు చేశారు. రామెన్‌ అంటే జపనీస్‌ న్యూడుల్స్‌ సూప్‌. శ్రుతి తయారు చేస్తున్నప్పుడు వీడియో తీసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు శంతను.

చదవండి: 

చెర్రీకి జోడి.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే!

‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement