సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్! | Shruti Haasan Out Of Chennai Story Movie | Sakshi
Sakshi News home page

సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!

Published Thu, Apr 11 2024 11:21 AM | Last Updated on Thu, Apr 11 2024 11:54 AM

Shruti Haasan Out Of Chennai Story Movie - Sakshi

సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలతో పాటు ఆమెకున్న మయాసైటిస్ వ్యాధి గుర్తొస్తుంది. అప్పటివరకు వరసపెట్టి మూవీస్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. దీని వల్ల ఆమె.. 'చెన్నై స్టోరీ' అనే హాలీవుడ్ చిత్రం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమకు అవమానం.. ఎన్టీఆర్‌ ముందే..!)

సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత.. సదరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ కు వచ్చింది. 'అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం రొమాంటిక్‌ కామెడీ కథతో సాగే మూవీ. ఇందులో శ్రుతి.. అనూ అనే లేడీ డిటెక్టివ్‌గా నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్యే మొదలైన షూటింగ్‌లోనూ పాల్గొంది. ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చింది.

అలాంటిది ఇప్పుడు శ్రుతిహాసన్.. చైన్నె స్టోరి మూవీ నుంచి వైదొలగినట్లు టాక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇందుకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో నటి సమంత, శృతిహాసన్‌ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్‌ గురు'.. ఎలా ఉందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement