అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మలి భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్‌ను వెంటనే ఆరంభించాలనుకున్నారు మేకర్స్. కానీ కాస్త ఆలస్యమైంది. ఇక అస్సలు తగ్గదేలే అంటూ పక్కా ప్లానింగ్‌తో ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లుగా తెలిసింది.
అయితే ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొనడం లేదు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు విదేశాలకు వెళ్లారు అల్లు అర్జున్. వచ్చీ రాగానే ఈ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment