
‘‘నువ్వు కావాలయ్యా..’’ పాట అందరినీ ఓ ఊపు ఊపేస్తోంది. సాధారణ జనాన్నే కాదు.. ఇతర రంగాల్లోని ప్రముఖులు ఈ పాటకు అడిక్ట్ అయిపోతున్నారు. దీనికి కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ అయితే, ముఖ్య కారణం నటి తమన్నా అనే చెప్పాలి. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలోనిది ఈ పాట. ఈ ఐటమ్ సాంగ్‌లో తమన్నా తన డ్యాన్సుతో ఉర్రూతలూగించింది.
ఈ పాటలో తమన్నా డ్యాన్స్, అందం, అభినయం, కవ్వింపుతనం కుర్రకారును పిచ్చెక్కిచ్చింది. చిత్ర వర్గాలు ఈ పాటనే ఎక్కువగా ప్రమోషన్‌కు వాడుకుంటున్నారు. ఇప్పటికే ఆ పాట కోట్లాది సంగీత ప్రియులను అలరించిందని గణాంకాలు చెబుతున్నాయి. యూట్యూబ్‌లోనే 100 మిలియన్ల వీక్షణలను అధిగమించిందట. అంతేకాదు, తమన్నా పేరు మార్మోగిపోయేలా చేసింది.
ఈ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో కావాలయ్యా ఈ రేంజ్‌లో సక్సెస్ కావడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒక మహిళ అబలగా ఉంటే అది ఆమెను ఆత్వవిశ్వాసం లేకుండా చేస్తుందని, అదే ఆత్వవిశ్వాసం కలిగి ఉంటే ఆదే ఆమెకు మరో సొత్తు అవుతుందని పేర్కొంది. మహిళలు స్వతాహాగా కొన్ని మానసిక భావాలు కలిగి ఉంటారని, అదే తమ ప్రకృతి స్వభావం అని పేర్కొంది. తాము ఏ విషయానైనా ఆలోచించకుండా నమ్మేస్తామంది. అయితే వాటికి తమ ప్రతిభను కలిపితే అంతకంటే శక్తి మరేమీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తమన్నా.
చదవండి: హరీశ్ శంకర్ ట్వీట్‌పై ట్రోలింగ్.. అసలు నువ్వెలా డైరెక్టర్ అయ్యావ్..?
Comments
Please login to add a commentAdd a comment