TS Govt Give Permission To Pushpa Movie 5th Show From 17th To 30 December - Sakshi
Sakshi News home page

Pushpa Movie: విడుదలకు కొద్ది గంటలే, బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Published Thu, Dec 16 2021 4:47 PM | Last Updated on Mon, Dec 20 2021 11:39 AM

Telangana Government Give Permission To Pushpa Movie 5th Show From 17th December To 30th December - Sakshi

TS Govt Give Permission To Pushpa Movie 5th Show: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ తొలి పార్ట్‌ పుష్ప: ది రైజ్‌ రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఏడు భాషల్లో విడుదలయ్యే పుష్ప మూవీ విడుదలకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరిచింది. ‘పుష్ప’ సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

డిసెంబర్‌ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక రూ. 50 టికెట్ల పెంపుపై కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో మేక‌ర్స్ కు త‌క్కువ స‌మ‌యంలోనే పుష్ప మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా నటిస్తుతండగా.. సునీల్‌, అన‌సూయలు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement