ప్రస్తుతం బాలీవుడ్‌లో వెడ్డింగ్ మూడ్ నడుస్తోంది. తాజాగా మరో బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'యే రిష్తా క్యా కెహ్లతా హై','దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర భామ వృషికా మెహతా తన ప్రియుడు సౌరభ్ ఘెడియాను పెళ్లాడింది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 10న వరుడి స్వస్థలమైన అహ్మదాబాద్‌లో జరిగింది. ఆమె ప్రియుడు సౌరభ్ ఘెడియా ప్రస్తుతం టొరంటోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 11 వీరికి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. సరిగ్గా ఏడాది తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి బంధువులు
పెళ్లికి సంబంధించిన ఫోటోలను వృషికా మెహతా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఆనంద సమయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. వృషికా మెృహతా దిల్ దోస్తీ డ్యాన్స్ (D3)షోలో షారన్ రాయ్ ప్రకాష్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఇష్క్‌బాజ్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' సీరియల్స్‌లో వృషికా కనిపించింది. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment