సంగీతజ్ఞాని ఇళయరాజా, దళపతి విజయ్ 23 ఏళ్ల తరువాత కలిశారు.. చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఆ కథేంటో చూద్దాం. విజయ్ తాజాగా నటిస్తున్న తన 68 చిత్రానికి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పేరును ఇటీవలే ఖరారు చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఆంగ్లంలో ఉన్న ఈ టైటిల్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు భారీ తారాగణం ఉండబోతుంది. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా షెడ్యూల్ కోసం యూనిట్ వర్గాలు శ్రీలంక బయలుదేరనున్నాయి. కాగా ఇళయరాజా సోదరుడు, వెంకట్‌ప్రభు తండ్రి, సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకనటుడు గంగై అమరన్ ఈ చిత్రం కోసం ఒక పాట రాయడం విశేషం.
మరో విశేషం ఏమిటంటే ఈ పాటను నటుడు విజయ్, సంగీత దర్శకుడు ఇళయరాజా కలిసి పాడారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలిసి 1995లో రాజావిన్ పార్వైయిల్, 1997లో కాదలుక్కు మరియాదై, 2000 సంవత్సరంలో కన్నుక్కుల్ నిలవు, 2001లో ఫ్రెండ్స్ చిత్రాల్లో కలిసి పని చేశారు. తాజాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో కలిసి పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment