ఆ వ్యాధులతో బాధపడుతున్న వితికా.. భరించలేకపోతున్నానంటూ.. | Varun Sandesh Wife Actress Vithika Sheru Reveals About She Is Suffering With Spondylitis And Migraine - Sakshi
Sakshi News home page

Vithika Sheru: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా

Oct 21 2023 1:10 PM | Updated on Oct 21 2023 1:37 PM

Vithika Sheru Suffering with Spondylitis and Migraine - Sakshi

ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఇటీవలే నీడ్లింగ్‌(నొప్పి తీవ్రంగా ఉన్న చోట సూదులతో గుచ్చే ప్రక్రియ) చేయించుకున్నాను. కానీ తర్వాత కనీసం నా

పడ్డానండీ ప్రేమలో మరి(2015).. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన ఈ జంట నిజజీవితంలోనూ జంటగా మారారు. సినిమా విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలంపాటు డిప్రెషన్‌లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారింది. 

సూదులతో గుచ్చారు, ఆ తర్వాతే..
అయితే వితిక కొంతకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించింది. నాకు స్పాండిలైటిస్‌, మైగ్రేన్‌ వ్యాధులు ఉన్నాయి. విపరీతమైన తలపోటు, మెడనొప్పి వల్ల ఏ పనీ చేయలేకపోతున్నాను. స్పాండిలైటిస్‌కు గానూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఇటీవలే నీడ్లింగ్‌(నొప్పి తీవ్రంగా ఉన్న చోట సూదులతో గుచ్చే ప్రక్రియ) చేయించుకున్నాను. కానీ తర్వాత కనీసం నా పనులు నేను చేసుకోగలిగాను. ఒత్తిడి వల్ల నెల రోజుల నుంచి మెడనొప్పి మరింత తీవ్రంగా మారింది. ఆ పెయిన్‌ భరించలేకపోతున్నాను.

స్పాండిలైటిస్‌కు తోడు మైగ్రేన్‌..
రెండువారాల క్రితం మైగ్రేన్‌ మొదలైంది. ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బందిపడుతున్నాను. గతంలోనూ స్పాండియాలసిస్‌తో బాధపడ్డాను, కానీ దాని నుంచి కోలుకున్నాను. హమ్మయ్య, ఇక ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేలోపు మళ్లీ అంతా మొదటికి వచ్చింది. అందుకే కొంత బాధగా ఉంది. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం. కానీ త్వరలోనే సాధ్యమైనంతవరకు కోలుకుని యూట్యూబ్‌లో అద్భుతమైన వీడియోలు చేస్తాను' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు వితిగా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: భగవంత్‌ కేసరి రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement