‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’

Published Wed, Jan 29 2025 1:07 AM | Last Updated on Wed, Jan 29 2025 1:07 AM

‘ఒక్క

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’

ములుగు: పాఠశాల విద్యలో ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించేలా చూడాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సురేందర్‌, ప్రధానకార్యదర్శి రామన్ననాయక్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పలు రకాల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆడియో విజువల్‌ లర్నింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు జీఓ 317 ప్రకారం అంతర్‌ జిల్లా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కోరడంతో పాటు తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

3కే రన్‌ విజేతలకు

షూస్‌ అందజేత

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ఇటీవల జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్పీ శబరీశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్‌లో పురుషుల విభాగంలో మండల పరిధిలోని కాల్వపల్లికి చెందిన కుర్సం రవి, మహిళల విభాగంలో వెంగలాపూర్‌కు చెందిన తెల్లం ప్రియాంకలు ప్రధమ స్థానం సాధించారు. ఈ మేరకు వారిని మంగళవారం మేడారంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం ఆవరణలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి షూస్‌ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి, ఏఎస్సై చింత నారాయణ, కానిస్టేబుల్‌ పూజారి రమేష్‌, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి పాల్గొన్నారు.

రామప్ప టెంపుల్‌ బాగుంది

వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌గా ఉందని, ఇలాంటి శిల్పాలను మరెక్కడ చూడలేదని ఫ్రాన్స్‌ దేశస్తులు హెరిక్‌, స్టీవెన్‌లు, అమెరికాకు చెందిన టీన్‌ కొనియాడారు. రామప్ప ఆలయాన్ని వారు వేర్వేరుగా మంగళవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వారికి గైడ్‌లు వెంకటేశ్‌, విజయ్‌కుమార్‌ ఆలయ విశిష్టత గురించి వివరించారు. రామప్ప శిల్పాల వద్ద ఫొటోలు దిగుతూ ఆలయ అందాలను తమ సెల్‌ఫోన్‌లలో బంధించుకున్నారు.

కోర్టు తీర్పుపై హర్షం

భూపాలపల్లి రూరల్‌: రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుందని ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ కర్నాటకపు సమ్మయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.9.98కోట్ల పరిహారం విడుదల చేసిందన్నారు. ఇది రైతుల విజయమన్నారు. ఈ సమావేశంలో యాస నర్సయ్య పాల్గొన్నారు.

నిందితులను శిక్షించాలి

కాటారం: సూర్యాపేటలో కులాంతర వివాహం చేసుకున్నాడని కృష్ణ అనే దళితుడిని రాళ్లతో కొట్టి ఉరివేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఉత్తర తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పీక కిరణ్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరువు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌, హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కిరణ్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’
1
1/3

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’
2
2/3

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’
3
3/3

‘ఒక్కోతరగతికి ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement