వైద్యం అందరికీ అందేలా కృషి
కన్నాయిగూడెం: ఏజెన్సీలోని ప్రతీ పల్లెకు వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. మండల పరిధిలోని ఐలాపూర్‌లో కంటైనర్ వైద్య ఉపకేంద్రం ఏర్పాటు చేసేందుకు మంగళవారం స్థానిక వైద్యుడు అభినవ్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఫిబ్రవరిలో ఐలాపూర్‌లో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేసే స్థలాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించారు. అనంతరం కన్నాయిగూడెం పీహెచ్సీ పరిధిలోని కొండాయి, చిన్నబోయినపల్లి ఆయుష్మాన్ కేంద్రాలను పరిశీలించి రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామమైన ఐలాపూర్‌లో కంటైనర్ వైద్య ఉప కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
ఎస్ఎస్ తాడ్వాయి: మండలం కేంద్రంలోని తాడ్వాయి పీహెచ్‌సీని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సిబ్బంది అటెండెన్స్, రోగుల ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. డెలవరీ మహిళను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే రోజువారి వైద్య సేవలపై వైద్యాధికారి చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో డెలవరీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అయన వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించారు.
డీఎంహెచ్ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment