ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Sun, May 5 2024 1:20 AM

ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ పూర్తి

నాగర్‌కర్నూల్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఈవీఎంల రెండోవిడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తిచేసినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్‌ జైవన్షీ, రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల రెండోవిడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్స్‌ కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినట్లు వివరించారు. రెండోవిడత ర్యాండమైజేషన్‌కు సంబంధించిన హార్డ్‌, సాఫ్ట్‌ కాపీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement