రైతుల వ్యథ తీరేనా?
వ్యవసాయానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ అనుసంధానం ఊసెత్తని ప్రభుత్వం
● రోజురోజుకూ పెరుగుతున్న
పంటసాగు ఖర్చులు
● కూలీల కొరతతో ఇబ్బంది
పడుతున్న అన్నదాతలు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతులకు తగిన తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సు చేసింది. వ్యవసాయ పనులకు సంబంధించి 75 శాతం రైతులు, 25 శాతం ఉపాధి నిధుల ద్వారా కూలీల ఖర్చులు భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కమిటీ పేర్కొంది. అయితే కమిటీ సూచనలను అమలు చేస్తే, వ్యవసాయదారులతో పాటు జిల్లాలో 1.95 లక్షల జాబ్ కార్డుల ద్వారా 3.74 లక్షల మంది కూలీలకు మేలు చేకూరనుంది. ప్రస్తుతం పంటసాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రభుత్వాలు అందించక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే.. తమ ఖర్చులో 25 శాతం మిగులుతుందని రైతులు పేర్కొంటున్నారు. కూలీలకు సైతం పనులు దొరికే అవకాశం ఉంటుంది.
నాగర్‌కర్నూల్: వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు పంటసాగు ఖర్చులు నానాటికీ తడిసి మోపెడవుతున్నాయి. రైతాంగం సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకువచ్చినా.. పెరుగుతున్న సాగు ఖర్చులతో అదనపు భారం మోయక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటసాగు ఖర్చులను తగ్గించేందుకు గాను ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు తీసుకువచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కూలీలు, రైతులకు లాభమే..
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు రాలేదు. అనుసంధానం చేస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏమైనా ఆదేశాలు వస్తే అమలుచేస్తాం.
– చిన్న ఓబులేషు, డీఆర్డీఓ
Comments
Please login to add a commentAdd a comment