మన్ననూర్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఆర్సీఓ పీఎస్ కళ్యాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండాపూర్, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, మన్ననూర్ గురుకులాల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో ఈ నెల 26న మహబూబ్‌నగర్ సమీపంలోని ఆర్సీఓ కార్యాలయం, టీజీటీడబ్ల్యూఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లతో పాటు మన్ననూర్ ప్రిన్సిపాల్ (94909 57314)ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment