కల్వకుర్తి టౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాయుద్ద నౌక గద్దర్ అందించిన సేవలు మరవలేనివని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెలతో కలిసి ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు గద్దర్ అని కొనియాడారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. గద్దర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. మొదటిసారిగా కల్వకుర్తికి వచ్చిన వెన్నెలకు కళాకారులు డప్పులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment