కొల్లాపూర్ కోర్టులో ఈ–సేవ కేంద్రం
కొల్లాపూర్: పట్టణంలోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో ఏర్పాటుచేసిన ఈ–సేవ కేంద్రాన్ని జిల్లా జడ్జి రాజేష్‌బాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ–సేవలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ కేసులకు సంబంధించిన స్థితిగతులు, తదుపరి విచారణ తేదీల వివరాలను తెలుసుకునేందుకు ఈ–సేవ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సర్టిఫైడ్ కాపీల స్వీకరణ, ఈ–ములాఖత్‌లకు ఇది ఉపయోగపడుతుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థ నుంచి ప్రజలు ఉచితంగా న్యాయసేవలను పొందవచ్చని తెలిపారు. కొల్లాపూర్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోత్స్న గుంటి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నె శ్రీహరి, న్యాయవాదులు శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి, వసంతరెడ్డి, ఉపేందర్, నిరంజన్, కురుమూర్తి, మోహన్‌లాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment