యాదాద్రి: ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రి పదవులు పొందిన ఇద్దరు నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969లో అప్పటి భువనగిరి ఎమ్మెల్యే కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉండి తన పదవికి రాజీనామా చేశారు.
అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2011లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండి తన పదవికి రాజీనామా చేశారు. కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు నుంచి, 1965 ఉప ఎన్నికలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటిసారి 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009, 2014లోనూ గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment