హుజూర్‌నగర్ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పూర్వ వీఆర్‌ఏలు
హుజూర్‌నగర్ : వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం ఎంప్లాయ్ ఐడీ ఇవ్వాలని పూర్వ వీఆర్‌ఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద పూర్వ వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించి వారు మాట్లాడారు. ఐదు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్రారు. ఎంప్లాయ్ ఐడీ ఇచ్చే వరకు సామూహికంగా సెలవులు పెడుతున్నట్లు డీఏఓ నారాయణరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పూర్వ వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో చైర్మన్ లక్ష్మల్ల నరసింహ మౌర్య, డివిజనల్ అధ్యక్షుడు చింతమల్ల కోటయ్య, జనరల్ సెక్రెటరీ మాలోత్ నాగు, పిచ్చమ్మ, జి. ఉపేందర్, వీరబాబు, శోభ, ఇందిరా, కె .నరసింహారావు, పి. చెన్నయ్య, ఎం. సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment