భోజన మెనూ సక్రమంగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

భోజన మెనూ సక్రమంగా పాటించాలి

Published Thu, Jan 30 2025 1:43 AM | Last Updated on Thu, Jan 30 2025 1:43 AM

భోజన

భోజన మెనూ సక్రమంగా పాటించాలి

హాలియా: భోజన మెనూ సక్రమంగా పాటించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. హాలియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ హాస్టల్‌ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. పీహెచ్‌సీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హాలియా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డికోరారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ అమిత్‌నారాయణ, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ రఘు, వైద్యాధికారి రామకృష్ణ, ఆర్‌ఐ నవీన్‌, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ హైమావతి ఉన్నారు.

రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి

వేములపల్లి(మాడ్గులపల్లి): మాడ్గులపల్లి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాడ్గులపల్లి మండలం నుంచి ఎక్కువ మంది రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పిస్తున్నారన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌ దృష్టికి తహసీల్దార్‌ తీసుకెళ్లగా త్వరలోనే నూతన కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఆర్‌ఐ రేణుక తదితరులు ఉన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
భోజన మెనూ సక్రమంగా పాటించాలి 1
1/1

భోజన మెనూ సక్రమంగా పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement