కేటీఆర్వన్నీ దగుల్బాజీ మాటలు
ఫ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్
నల్లగొండ: నల్లగొండలో చేపట్టిన రైతు మహా ధర్నాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ దగుల్బాజీ మాటలు అని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ విమర్శించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకున్నారని, అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గుమ్మల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో కేటీఆర్ రైతుఽ ధర్నా ఒక డ్రామా అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గంతోపాటు డిండి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నాయకులు జూలకంటి శ్రీనివాస్, ఇబ్రహీం, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి రమేష్‌యాదవ్, కత్తుల కోటి, వజ్జ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment