ఆపరేషన్లు లేకుండా కాన్పులు చేయాలి
నాగార్జునసాగర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు లేకుండా సహజ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని డీసీహెచ్‌ఎస్ లు, ఏరియా ఆస్పత్రుల సూపరిండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌లు మాతృనాయక్, చిన్నానాయక్, వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
దేవరకొండ: దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన దేవరకొండ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని వైద్యులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్, సూపరింటెండెంట్ రవిప్రకాశ్, సిబ్బంది ఉన్నారు.
ఫ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment