‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
రాష్ట్రంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయి
కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా సహకరించుకుంటున్నాయి
ఓ అవినీతి కేసులో కేటీఆర్ విచారణకు అనుమతి కోరితే గవర్నర్ కార్యాలయం పెండింగ్‌లో పెట్టింది
మరోవైపు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిశారు.. విచారణ భయంతోనే ఢిల్లీ వచ్చారు
మహారాష్ట్రలో కేసీఆర్ అభ్యర్థులను నిలపలేదేం?
దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది
దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తున్నా..ఆ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు
‘నియోజకవర్గాల పునరి్వభజన’పై కేంద్రం కమిషన్ ఏర్పాటు చేయాలన్న సీఎం
ప్రాణాలు, పదవులు త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బు అవసరం ఏముందని వ్యాఖ్య
రెడ్డి పేరు మీద ఉన్నవారంతా నా బంధువులు కాదు. సృజన్ రెడ్డికి బీఆర్‌ఎస్ హయాంలోనే రూ. వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి. ఈ–రేస్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వచ్చారు. అవినీతి పార్టీ అయిన బీజేపీని అంతం చేస్తామన్న కేటీఆర్... ఇప్పుడు బీజేపీ నేతలను ఎలా కలుస్తున్నారు? –సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా రెండు పార్టీలూ సహకరించుకుంటున్నాయని చెప్పారు. ‘అవినీతికి సంబంధించిన ఓ కేసులో కేటీఆర్‌ను 17 (ఎ) కింద విచారించేందుకు రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం.. గవర్నర్ అనుమతి కోరింది. కానీ గత 15 రోజులుగా గవర్నర్ కార్యాలయం దీన్ని పెండింగ్‌లో పెట్టింది.
ఇదే సమయంలో కేటీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలిశారు. దీన్నెలా చూడాలి? ఏసీబీ విచారణ భయంతోనే ఆయన ఢిల్లీ వచ్చారు. కేంద్రం కూడా గవర్నర్‌ను పిలిపించిందని అంటున్నారు. అదెంతవరకు నిజమో తెలియదు. మరోపక్క మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసి, అభ్యర్థులను బరిలో నిలుపుతామన్న కేసీఆర్ ఎందుకు నిలపలేదు? మహారాష్ట్ర వైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదు? మోదీకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన ఎందుకు చేయలేదు? తెలంగాణకు మద్దతుగా నిలిచిన శరద్ పవార్ పార్టీకి మద్దతుగా అయినా ఒక్కపని ఎందుకు చేయలేదు?..’సీఎం నిలదీశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జనాభా ఆధారంగా నిధుల పంపకాలా?
‘దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుస్తున్నా.. ఆ రాష్ట్రాలను మాత్రం చిన్నచూపు చూస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వస్తున్న నిధుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదు. తెలంగాణ నుంచి ఒక రూపాయి దేశానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 40 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అదే సమయంలో బిహార్ రూపాయి ఇస్తే రూ.7.06, ఉత్తర్‌ప్రదేశ్ రూపాయి ఇస్తే రూ.2.73 పొందుతున్నాయి.
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు మోదీ మద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేయగలదు. కుటుంబ నియంత్రణ చేయాలని ఒత్తిడి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు జనాభా ఆధారంగా నిధుల పంపకాలు ఎలా చేస్తుంది? మరోవైపు ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల 1971 జనగణన ఆధారంగానే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. నియోజకవర్గాల పునరి్వభజనకు అవసరమైన టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (సూచన నిబంధనలు) కోసం కేంద్రం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి..’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మోదీ గుజరాత్‌కు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు
‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండి గుజరాత్ మోడల్‌కు చేసిన ప్రచారానికి కేంద్రం ఎలాంటి ఆటంకం కలిగించలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఆ రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ప్రయత్నిస్తే గుజరాత్ వెళ్లమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది. ఆయన దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్‌కు ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ మనవడు ఉండేందుకు ఒక్క గది లేదు
‘తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం ఏటీఎంగా మార్చుకుందని మోదీ ఆరోపిస్తున్నారు. పదేపదే గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆ రాష్ట్రం ఏటీఎం..ఈ రాష్ట్రం ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేతలు వ్యాఖ్యలు చేస్తే వదిలేయవచ్చు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు. సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచి్చనా వదులుకున్నారు. ప్రాణాలను, పదవులను, ఇళ్లను త్యాగాలు చేసినవాళ్లకి డబ్బులెందుకు? మారుమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి. కానీ అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మోదీ రాజకీయాలకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది
రహస్య ఎజెండాను బయటపెట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రతి ఎన్నికల్లో మోదీ భావోద్వేగంతో కూడిన, విభజన రాజకీయాలు చేస్తున్నారు. వాటికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం రాజకీయ ఫార్మాట్ మార్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం మానేసి, 20–20 ఫార్మాట్ ఆడాలి..’అని రేవంత్ అన్నారు.
నాయుడు, నితీశ్ లాంటి వారితో కేంద్రం నడుస్తోంది
‘గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ముమ్మాటికీ ఓటమి పాలయ్యారు. బీజేపీ ఈ దఫా 400 సీట్లు అని నినదించినా, 240 సీట్లే సాధించారు. కానీ కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది. నంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ఇప్పుడు నాయుడు, నితీశ్ లాంటి కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది.. ఇది మోదీ ఓటమే.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు..
‘తెలంగాణ రైజింగ్ అంటే ప్రతి ఒక్కరికీ సమా న అవకాశాలు కలి్పంచడం. ఇదే తెలంగాణ మోడల్. సుపరిపాలన తెలంగాణ మోడల్. దాని అర్థం సంక్షేమం, అభివృద్ధి. కేవలం సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదు. కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే పేదలకు ఏం దక్కదు. ఈ రెండింటినీ సమతుల్యం చేయడమే సుపరిపాలన. దానిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ పదిసార్లు సచివాలయానికి రాలేదు. నేను పది నెలలుగా ప్రతిరోజూ సచివాలయానికి వెళుతున్నా. ప్రతిపక్షంలో ఉండి ఆయన శాసనసభకు రావడం లేదు. వాళ్లు ధర్నా చౌక్‌ను మూసివేశారు.
నేను అదే ధర్నా చౌక్‌ను ఓపెన్ చేశా. ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా వారానికి రెండుసార్లు వచ్చి ధర్నా చౌక్‌కు వచ్చి కూర్చుంటున్నారు. మేం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామో చూడండి. తెలంగాణ అప్రోచ్‌నే కాంగ్రెస్ అప్రోచ్. తెలంగాణ రైజింగ్ కాంగ్రెస్ అప్రోచ్..’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను గతంలో కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశానని.. టీఆర్‌ఎస్‌లో ఎన్నడూ పని చేయలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడితో కలిసి పని చేశానని అన్నారు. అమెరికా ఎలక్ట్రోరల్ సిస్టమ్‌లో తెలుగు ప్రజలు ఉన్నారని, వారు ఇప్పుడు అక్కడి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని రేవంత్ చెప్పారు.
లగచర్ల ఘటనలో ఎవర్నీ వదిలిపెట్టం
⇒ ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే
⇒ గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు
కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో సోమవారం కలెక్టర్, ఇ తర అధికారులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం అన్నా రు. దాడులకు ప్రోత్సహించేవారిని, అండగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమని చెప్పారు. అలాంటివారు ఎంతటి వారై నా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించా రు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని, సృజన్‌రెడ్డికి బీ ఆర్‌ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయ ని చెప్పారు. ఈ–రేస్ స్కామ్ నుంచి తప్పించుకు నేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారని.. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయని అన్నారు. అవినీతి పార్టీ అయిన బీజేపీ ని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బీజేపీ నేతలను కలుస్తున్నారని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment