
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పళని మురుగన్, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, సమయపు రం మారియమ్మన్ ఆలయాలను టీటీడీ తరహాలో అభివృద్ధి చేయ నున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. పర్యాటకం, సంస్కృతి, సంప్రదా యం, దేవదాయ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. స్థానికంగా ఆయా ఆలయాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి భక్తులను కొండపైకి చేర్చడాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని వంద ఆలయాలను మరింతగా తీర్చిదిద్ది బ్రహ్మోత్సవాలను నిర్వహించడం, గ్రామీణ ప్రాంత ఆలయాల్లో పనిచేసే పూ జారి, ఇతర సిబ్బందికి పింఛన్ సౌకర్యం కల్పించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment