భువనేశ్వర్: వివాహ వేడుక అనగానే బ్యాండ్ మేళాలతో డ్యాన్స్‌లు వేస్తూ, మరోవైపు బాణసంచాల కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అయితే అవి మోస్తారు పరిధిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆహ్లాదభరిత వాతావరణంలో చేసుకువాల్సిన తంతు. కానీ ఇక్కడొక వివాహ వేడుకలోని మోగిన సంగీత భాజాలు కారణంగా కోళ్లు చనిపోయాయి.
(చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది.)
అసలు విషయంలోకెళ్లితే... తూర్పు ఒడిషాలోని రంజిత్ కుమార్ పరిదా అనే వ్యక్తి పౌల్ట్రీ ఫారమ్‌కి కొద్ది దూరంలో పెళ్లి బాజాలతో బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున వివాహ ఊరేగింపుగా వస్తున్నట్లు చెబుతున్నాడు. పైగా వాళ్లు పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టారని, అంతేకాక చెవులు చిల్లులు పడేంత శబ్దంతో వాళ్లంతా చిందులేస్తూ ఉన్నారని అన్నారు. అయితే సదరు వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే వాళ్లు వినలేదని చెబుతున్నాడు. దీంతో తన కోళ్ల ఫారమ్‌లోని 65 కోళ్లు చనిపోయినట్లు చెప్పాడు. కోళ్లు గుండెపోటుతో చనిపోయాయని పశువైద్యుడు నిర్ధారించినట్టు రంజిత్ తెలిపాడు.
ఈ క్రమంలో జంతువుల ప్రవర్తనపై పుస్తకాన్ని రచించిన జువాలజీ ప్రొఫెసర్ సూర్యకాంత మిశ్రా పెద్ద పెద్ద శబ్దాలు పక్షులలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. అంతేకాదు వివాహ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించడానికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని రంజిత్ చెప్పాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవల్సిందిగా సూచించడంతో చివరికి కథ సుఖాంతం అయ్యింది. పైగా రంజిత్ ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో తాము ఎటువంటి చర్య తీసుకోలేదని పోలీసు అధికారి ద్రౌపది దాస్ తెలిపారు.
(చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment