
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు మండు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మంగళవారం(ఏప్రిల్23) సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి.
హీట్‌వేవ్‌తో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా వర్షం పడటంతో చల్లబడింది. వర్షం పడుతున్న దృశ్యాలను ఢిల్లీ వాసులు ఆనందంతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలో హీట్‌వేవ్ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.