వారే నాకు రక్షణ కవచం: మోదీ
నందూర్బర్: తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, తనకు ఎలాంటి హాని కలుగకుండా వారే కాపాడుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మహారాష్ట్రలో ఓటు బ్యాంక్‌ను బుజ్జగించడానికి నకిలీ శివసేన తనను దూషిస్తోందని, బెదిరింపులకు దిగుతోందని శివసేన(ఉద్ధవ్)పై మండిపడ్డారు.
శనివారం మహారాష్ట్రలోని నందూర్బర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల మద్దతును, విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు. తనను అంతం చేయడానికి సాగుతున్న కుట్రలు ఫలించబోవని తేలి్చచెప్పారు. తనను సజీవంగా గానీ, నిర్జీవంగా గానీ సమాధి చేయకుండా ప్రజలు అడ్డుకుంటారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మొఘల్ రాజు ఔరంగజేబును సమాధి చేసినట్లు మోదీని సైతం సమాధి చేయాలంటూ శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ ఇచి్చన పిలుపును మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. మోదీకి సమాధి తవ్వుతామంటూ కాంగ్రెస్ బెదిరిస్తోందని ఆక్షేపించారు. శివసేన(ఉద్ధవ్) కూడా తనకు హెచ్చరికలు జారీ చేస్తోందని, బాల్‌థాక్రే బతికి ఉంటే చాలా బాధపడేవారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment