
పట్నా: బిహార్ స్వాత్రంత్య వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీష్‌కుమార్ ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు ఆయన హై సెక్యూరిటీ జోన్‌లోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాత్రంత్య దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. అనంతరం ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని వేదిక వద్దకు దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు.
ఆ యువకుడిని ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ పాశ్వాన్ కుమారుడు నితీష్ కుమార్ (26)గా గుర్తించారు. అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంను కలిసేందుకు అక్కడకు వచ్చాడని పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
చదవండి: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment