న్యూఢిల్లీ: ప్రధానిగా రెండో టర్ము చివరి దశకు వచ్చినా మోదీ చరిష్మా చెక్కు చెదరడం లేదు. ఇప్పటికీ భారత్‌లో మోదీని ప్రధానిగా 76 శాతం మంది ఆమోదిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.ప్రపంచంలోని పలు అగ్ర దేశాల ప్రధానుల్లోకెల్లా మోదీ యాక్సెప్టెన్సీ రేటు అత్యధికంగా ఉండటం విశేషం.
అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో మోదీ ఇప్పటికీ నెంబర్ వన్ అని తేలింది. అయితే దేశంలో 18 శాతం మంది మాత్రం మోదీ ప్రధానిగా ఉండటాన్నివ్యతిరేకించగా 6 శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేమన్నారు.
మోదీ తర్వాత మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మ్యాన్యువెల్ లోపెజ్ ఆ దేశంలో 66 శాతం మంది ప్రజల ఆమోదంతో రెండో స్థానంలో నిలిచారు. 58 శాతం మంది ఆమోదంతో స్విస్ ప్రెసిడెంట్ అలెయిన్ బెర్సెట్ మూడవ స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడ్‌న్ 37 శాతం, కెనడియన్ పీఎమ్ జస్టిన్ ట్రూడో 31 శాతం, యూకే పీఎమ్ రిషిసునాక్ 25 శాతం, ఫ్రాన్స్ అధ్యకక్షుడు మార్కన్‌కు24 శాతం ఆమోదం లభించింది.
గతంలోనూ మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేల్లో మోదీ ప్రపంచంలోని దేశాధినేతల్లో టాప్‌లో నిలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయఢంకా మోగించిన తర్వాత వెల్లడైన ఈ సర్వే ఆ పార్టీకి పెద్ద పాజిటివ్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏదే హవా అని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి..‘మహువా’పై వేటు క్రికెట్‌లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
Comments
Please login to add a commentAdd a comment