
న్యూఢిల్లీ: ప్రేమ దుకాణం పేరిట రాహుల్ మెగా విద్వేష షాపింగ్ మాల్ తెరిచారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివృద్ధిని ప్రపంచమే గుర్తించింది. దాన్ని యువరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సర్జికల్ స్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. హిందువులు, ముస్లింలను విడదీయడంపై మాట్లాడుతారు. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ప్రేమ దుకాణం నడుపుతున్నానంటూ చెప్పుకుంటుంటారు. నిజానికది మెగా విద్వేష షాపింగ్ మాల్’’ అన్నారు.