బీజేపీ అధిష్టానం మార్చి 24 సాయంత్రం లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. ఇందులో కోజికోడ్‌కు చెందిన కే సురేంద్రన్ పేరు కూడ ఉంది. ఈయన కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ కీలక నేత 'రాహుల్ గాంధీ'పై.. ప్రత్యర్థిగా పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ కంచుకోట అయిన వాయనాడ్‌లో రాహుల్ గాంధీ 2019లో విజయం సాధించారు. అయితే ఈసారి కాంగ్రెస్ కీలక నేతను ఢీకొట్టడానికి బీజేపీ 'సురేంద్రన్'ను బరిలోకి దింపింది.
ఎవరీ సురేంద్రన్?
కేరళలోని కోజికోడ్ జిల్లా ఉల్లియేరిలో జన్మించిన కున్నుమ్మెల్ సురేంద్రన్ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకుడు. కోజికోడ్‌లోని జామోరిన్ గురువాయూరప్పన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా తన రాజకీయ యాత్రను ప్రారంభించారు.
తన రాజకీయ ప్రయాణంలో.. కే సురేంద్రన్ ఉత్తర మలబార్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్, దేశ సేవా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు, నేషనల్ యువ కో-ఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక డైరెక్టర్ బోర్డు సభ్యునితో సహా పలు పదవులను నిర్వహించారు.
2019 సార్వత్రిక ఎన్నికలలో సురేంద్రన్ పతనంతిట్ట లోక్‌సభ నుంచి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. 2016లో అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు.
కే సురేంద్రన్ ప్రస్తుతం కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన 2018లో శబరిమల ఆందోళన సమయంలో ఒక నెలరోజుల పాటు జైలులో గడిపారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలలో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయిన సురేంద్రన్.. ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా నిలబడ్డారు.
I am delighted to share with you that @BJP4India has announced my name as the NDA candidate in Wayanad against the #INDI Alliance leader Rahul Gandhi in his sitting constituency. I am extending my heartfelt thanks to Hon'ble PM Shri @narendramodi Ji, Shri @JPNadda Ji, @AmitShah…
— K Surendran(മോദിയുടെ കുടുംബം) (@surendranbjp) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment