● మొదటిసారిగా సీసీ కెమెరాలు మధ్య ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ● జిల్లాలో మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ● పరీక్షలకు హాజరుకానున్న 6,828 మంది విద్యార్థులు ● ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

● మొదటిసారిగా సీసీ కెమెరాలు మధ్య ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ● జిల్లాలో మొత్తం 46 పరీక్ష కేంద్రాలు ● పరీక్షలకు హాజరుకానున్న 6,828 మంది విద్యార్థులు ● ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు

Published Fri, Jan 31 2025 1:33 AM | Last Updated on Fri, Jan 31 2025 1:33 AM

● మొదటిసారిగా సీసీ కెమెరాలు మధ్య ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

● మొదటిసారిగా సీసీ కెమెరాలు మధ్య ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

లక్ష్మణచాంద: వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల టైంటేబుల్‌ను ఇప్పటికే విద్యా శాఖ ప్రకటించింది. దీంతో ఉత్తమ ఫలితాల సాధనకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. సందేహాలు నివృత్తి చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను సీసీ కెమెరాల మధ్య నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. ఎట్టకేలకు ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు...

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు అనగానే కొన్ని కళాశాలలు ప్రాక్టికల్‌కు వచ్చిన ఎగ్జామినర్లను మేనేజ్‌ చేసుకుని తాము అనుకున్నట్లుగానే తమ విద్యార్థులకు అధికంగా మార్కులు వేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు అధికారులు ఈ సంవత్సరం నుంచి సీసీ కెమెరాల మధ్యన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రతీ ల్యాబ్‌లో రెండు కెమెరాలు..

ఇంటర్‌ ప్రయోగ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 37 పరీక్ష కేంద్రాలు, ఒకేషనల్‌ విద్యార్థుల కోసం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రయోగ పరీక్షలు జరిగే ప్రతీ ల్యాబ్‌లో నాలుగు మెగాఫిక్సెల్‌ కలిగిన రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు వాయిస్‌ రికార్డింగ్‌, వీడియో రికార్డింగ్‌ సౌకర్యం కలిగి ఉంటాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.

6,828 మంది విద్యార్థులు..

జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు 6,828 మంది హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ విద్యార్థులు 2,159, బైపీసీ విద్యార్థులు 2,118, ఒకేషనల్‌ విద్యార్థులు 2,551 ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ మూడు దఫాలలో నిర్వహించనున్నారు. మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండోదఫా ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు, మూడోదఫా ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.

బోర్డు నిర్ణయం మేరకు

ఇంటర్‌ బోర్డు నిర్ణ యం మేరకు ఉన్నతాధికారుల సూచన ల మేరకు జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీ క్షలు సీసీ కెమెరాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో సీసీ కె మెరాల ఏర్పాటు పూర్తయింది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. – పరశురామ్‌ నాయక్‌, డీఐఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement