చిన్న పరిశ్రమలపై దృష్టిసారించాలి
● డీఆర్డీవో విజయలక్ష్మి
భైంసారూరల్: భైంసా డివిజన్ వ్యాప్తంగా స్వయం సహాయ సంఘాల మహిళలకు చిన్న పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని డీఆర్డీవో విజ యలక్ష్మి సూచించారు. భైంసా మండల సమాఖ్య భవనంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఐకేపీ ఏపీఎం, సీసీలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మండలాలవారీగా సీ్త్రనిధి రుణాలు, బ్యాంకు లింకేజీలు, రుణాల రికవరీల వి వరాలను అడిగి తెలుసుకున్నారు. రుణాల రికవరీ లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. స్వయంసహా య సంఘాల మహిళల వద్దకు వెళ్లి స్థానికంగా వా రికి ఉపాధి ఇచ్చే చిన్న పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. రుణాలు ఇప్పించడం, రికవరీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వచ్చే నెల 15 వరకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మార్చి 31లోపు రు ణాలు రికవరీ చేయాలని ఆదేశించారు. అన్నిచోట్ల మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీపీఎం సాయిప్రసాద్, సీ్త్రనిధి ఆర్ఎం సరిత, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment