ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి
● పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య రక్షణ అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యత అన్నారు. టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వత్తాసు పలుకుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకుని వాటిని సరైన పద్ధతిలో పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు లక్ష్మి, విజయ, గంగామని, కవిత, కమల, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, నాయకులు గంగన్న, సాయన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment