నిజామాబాద్‌ | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Published Wed, May 8 2024 5:55 AM

నిజామ

సరదాగా కేసీఆర్‌

వాతావరణం

ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి నిర్మలంగా

ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి

వేసవి శిబిరాల్లో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న సూచించారు.

బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024

IIలో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: బస్సుయాత్రలో భాగంగా నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి వెళుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంగళవారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్దనున్న హోటల్‌లో ఆగారు. అక్కడ టిఫిన్‌ తిని టీ తాగారు. ఈ సందర్భంగా హోటల్‌ యజమాని వెంకటరమణయ్యతో మాట్లాడారు. ఉల్లిగడ్డ పకోడీలు తీసుకున్న కేసీఆర్‌ అక్కడ ఉన్న చిన్నారులకు తినిపించారు. తనను కలిసేందుకు వచ్చిన రైతులకు పకోడీలు ఇచ్చారు. హోటల్‌ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్‌ సంభాషణ సరదాగా నడిచింది.

నాయకులు, కార్యకర్తలతో ఫొటోలు

సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఇంట్లో కేసీఆర్‌ బస చేశారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్‌ తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. వృద్ధులు, వికలాంగులు, ఉద్యమకాలంలో పనిచేసిన జర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదులు, కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారి యోగక్షేమాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కాగా కేసీఆర్‌ ప్రభుత్వంలో దళిత బంధు పథకం పొందిన లబ్ధిదారులు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్‌ను కలిసిన బాజిరెడ్డి కుటుంబం

నిమామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ మంగళవారం తన నివాసంలో వేదపండితుల ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు, పవిత్ర హోమ ద్రవ్యాలు, వేదపండితులతో కలిసి వచ్చిన బాజిరెడ్డి కుటుంబ సభ్యులు వాటిని కేసీఆర్‌కు అందించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, ఆయన తమ్ముడు మహేష్‌ గుప్తా కేసీఆర్‌కు జ్ఞాపికను బహుకరించారు. కేసీఆర్‌ ఫొటోలు దిగుతున్న సమయంలో కొద్తిసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో కేసీఆర్‌.. ‘రాష్ట్రంలో కరెంటు అసలే పోతలేదు.. బీఆర్‌ఎస్‌ నేతలు అబద్దాలు ఆడుతున్నారు’.. అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

న్యూస్‌రీల్‌

పకోడీలు పంచిపెట్టిన కేసీఆర్‌

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద

హోటల్‌లో టిఫిన్‌, టీ తీసుకున్న

గులాబీ బాస్‌

నిజామాబాద్‌లో నాయకులు,

కార్యకర్తలతో ఫొటోలు

నిజామాబాద్‌
1/6

నిజామాబాద్‌

నిజామాబాద్‌
2/6

నిజామాబాద్‌

నిజామాబాద్‌
3/6

నిజామాబాద్‌

నిజామాబాద్‌
4/6

నిజామాబాద్‌

నిజామాబాద్‌
5/6

నిజామాబాద్‌

నిజామాబాద్‌
6/6

నిజామాబాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement