చెక్ పోస్ట్‌ను కాల్చివేసిన దుండగులు
పోతంగల్ (రుద్రూర్): ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుకు నిప్పుపెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కొడిచర్ల శివారులో చోటు చేసుకుంది. మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణాాను అరికట్టడానికి కొడిచర్ల గ్రామ శివారులోని మద్నూర్ మండలం సిర్పూర్ వెళ్లే దారిలో అధికారులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఇసుక అక్రమ రవాణాకు ఇబ్బందులు కలుగుతున్నాయని భావించిన అక్రమార్కులు సిబ్బంది లేని సమయంలో నిప్పుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌కు ఇసుక అక్రమార్కులు నిప్పు పెట్టారంటే, వారు ఎంతకు తెగించారో అర్థమవుతోంది. ఈ ఘటన మండలంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయమై బుధవారం పోతంగల్ తహసీల్దార్ మల్లయ్య కోటగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కోటగిరి ఎస్సై సందీప్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కామారెడ్డి జిల్లా డొంగ్లీ మండలం లింబూర్‌కు చెందిన వ్యక్తిని అనుమానిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment