కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి పెద్దపీట
మోపాల్: వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తోందని నిజా మాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. సన్నరకాలకు బోనస్ రైతుల ఖాతా ల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమ వారం తాడెంలో రైతులతో కలిసి సీఎం, మంత్రు లు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశా రు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ, పింఛన్ల పెంపు, తదితర హా మీల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆ రు గ్యారెంటీల అమలుకు కంకణబద్ధులై పని చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కా ర్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరె డ్డి, నాయకులు సూర్యారెడ్డి, జలంధర్‌రెడ్డి, నారా యణరెడ్డి, విజయ్‌రెడ్డి, పాష, సాయిరెడ్డి, సాయికుమార్, కెతావత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment