ధర్నాను విజయవంతం చేయాలి
మోపాల్: రైతులు, రైతు కూలీలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 26న నగరంలో చేపట్టనున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రగతిశీల రైతు కూలీ సంఘం ప్రధానకార్యదర్శి సాయాగౌడ్ కోరారు. ఈమేరకు ఆదివారం మోపాల్ మండలకేంద్రంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సాయాగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని, రైతు కూలీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నాయకులు గంగమల్లు, మంగళ్‌పాడ్ నారాయణ, వెంకట్, ఎర్రన్న, దండు నర్సయ్య, కచ్చ గంగారాం, దండు మహేష్, కెంపు ఎల్లయ్య, బావురి సాయిలు, దమ్మడి గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ సిటీ: నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో నిరసన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరపత్రాల పంపిణీ, సభలు, సమావేశాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈనెల 26న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాయకులు శంకర్‌గౌడ్, నూర్జహాన్, వెంకటేష్, నన్నేసాబ్, మోహన్, గణేష్, గంగాధర్, కటారి రాములు, నరసయ్య ఎల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment