No Headline
వైభవంగా పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
కమ్మర్‌పల్లి: మండలంలోని ఉప్లూర్‌లో ఆదివారం పెద్ద పోచమ్మ, మహాలక్ష్మి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పోతరాజులు నిర్వహించిన కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో ప్రతిష్టించారు. గ్రామస్తులు నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వీడీసీ ప్రతినిధులు సోమ దశరత్, కొమ్ముల రవీంధర్, సుంకరి విజయ్, బద్దం రమేష్, బోనగిరి రాజేశ్వర్ పాల్గొన్నారు.
నేటి నుంచి అయ్యప్ప స్వాములకు భిక్ష
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయం ఆవరణలో నేటి నుంచి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి, అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష (అన్నదాన ప్రసాదం) వితరణ నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు పెంట జలంధర్ అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వాముల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నుంచి జనవరి 5వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12.30 గం.ల నుంచి 3గం.ల వరకు భిక్ష ఉంటుందన్నారు. సమితి సభ్యులు ఇరుపాజీ జనార్దన్ గౌడ్, మీసాల రాజేశ్వర్, ధనపల్ శివ, చేపూర్ ధనంజయ్, మీసాల మహేష్, గుడి గోపి, సురేష్‌గోల్డ్, నరేష్ స్వాములు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికం
Comments
Please login to add a commentAdd a comment