ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం
రెంజల్(బోధన్) : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వీరన్నగుట్టతండా, బోర్గాం, మౌలాలితండా గ్రామాల్లో ఆదివారం నూతన గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. రెంజల్‌లోని రైతువేదికలో మండలంలోని 59మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ రైతుకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీని త్వరలో పూర్తి చేస్తామన్నారు. బ్యాంకులు, సహాకార సంఘాల్లో జరిగిన సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ దక్కలేదని అన్నారు. అలాంటి రైతులు తప్పులను సరిదిద్దుకుని తిరిగి దరఖాస్తు చేసుకుంటే రుణమాఫీకి అర్హులైతారని తెలిపారు. నియోజకవర్గంలోని రైతులు చెరుకు సాగుకు ముందుకు రావాలని సూచించారు. రైతులు, కార్మికుల నిర్ణయం మేరకు ప్రభుత్వం అందరి సూచనలు, సలహాలను తీసుకుని చెరుకు ఫ్యాక్టరీ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతీ నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహేర్‌బిన్ హందాన్, మండల అధ్యక్షుడు మొబిన్‌ఖాన్, నాయకులు సాయరెడ్డి, రాములు, దనుంజయ్, రమేష్‌కుమార్, మొయినోద్దిన్, జాదవ్ గణేష్‌నాయక్, బన్సీనాయక్, సాయిబాబగౌడ్, కుర్మె శ్రీనివాస్, జావీద్, మోహన్, షబ్బీర్, వేణు, వెంకటి, ఇందిరారెడ్డి, కవిత, సవిత తదితరులు పాల్గొన్నారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
Comments
Please login to add a commentAdd a comment