ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం
డిచ్‌పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎన్‌సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎన్‌సీసీ అధికారి శ్రీనివాస్ ఖత్రి మాట్లాడుతూ.. ఎన్‌సీ సీ దేశభక్తితో నిండిన భావిభారత పౌరులను తయారు చేస్తుందన్నారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రా ధాన్యత లభిస్తుందని తెలిపారు. మండలంలో ని రాంపూర్ పాఠశాలలో మాత్రమే ఎన్‌సీసీ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లుతెలిపారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ యూనివర్సిటీల ఇన్‌చార్జి రెహమాన్ డిమాండ్ చేశారు. తెయూలో ఆదివారం నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఏఐఎస్‌ఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐఎస్‌ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్‌గా సాయి, కో కన్వీనర్‌గా సంజయ్, చందు ఎన్నికయ్యారు. సభ్యులు నవీన్ కృష్ణ, నాయకులు అజయ్, గౌతమ్ పాల్గొన్నారు.
4న ‘హరిదా‘ మహాసభ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ ఆవరణలో డిసెంబర్ 4న హరిదా మహాసభ నిర్వహించనున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్, నవ్య భారతి విద్యాసంస్థల అధినేత సంతోష్‌కుమార్ తెలిపారు. నగరంలోని కేర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మహాసభ లో ప్రధాన అంశంగా ‘సరస్వతీరాజ్ హరిదా తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని‘ ప్రఖ్యాత కవి విమర్శకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి అందజేయనున్నట్లు వారు తెలిపారు. జిల్లా సాహిత్య రంగంలో కృషి చేస్తున్న వారికి సరస్వతీరాజ్ అవార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఔత్సాహిక కవులు 29లోగా తమ పేర్లను 88972 13286, 83740 02227 నమోదు చేసుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి కాసర్ల నరేశ్ రావు, కోశాధికారి గంట్యాల ప్రసాద్, అధికార ప్రతినిధి నరాల సుధాకర్, ఉపాధ్యక్షుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య, సీనియర్ కవి పంచరెడ్డి లక్ష్మణ్, కొయ్యాడ శంకర్, మద్దుకూరి సాయిబాబు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ రూరల్: సేవానంది, సేవా భూషన్, జాతీయస్థాయి పురస్కారాలు కోసం దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమీ (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక , సేవా సంస్థ) వ్యవస్థాపకుడు ఈఎస్‌ఎన్ నారాయణ మాష్టారు ఒక ప్రకటనలో తెలిపారు. విద్య, వైద్యం, సా హిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, నాటకరంగం, టీవీ, సీనీ రంగాల్లో సేవలందిస్తున్నవారు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డోర్ నెంబర్ 1–20–164 తిరుమలగిరి, కోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15 అడ్రస్‌కు దరఖాస్తులను పంపించలన్నారు. మరిన్ని వివరాలకు 96523 47207 సంప్రదించాలని సూచించారు.
పోలింగ్‌బూత్‌ల పరిశీలన
ఇందల్వాయి: మండలంలోని పోలింగ్ బూత్‌ల ను ఆదివారం ఆర్డీవో రాజేందర్ తనిఖీ చేశా రు. ఈసందర్భంగా ఆయన అధికారులు, బూ త్‌స్థాయి ఆఫీసర్లతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు. చనిపోయిన వారిని, మిగతా అనర్హులను తొలగించాలని అన్నారు. తహసీల్దార్ వెంకట్రావు, సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ తదితర సిబ్బంది ఉన్నారు.
వాహనాల తనిఖీ
మోపాల్: మండలకేంద్రంలో ఆదివారం పోలీ సులు వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ ని బంధనలు పాటించని వారికి జరిమానాలు వి ధించినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. వా హనదారులు తప్పకుండా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని,హెల్మెట్లు తప్పనిసరి వాడాలని పే ర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. ఏఎస్సై రమేష్‌బాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment